హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ) : ఆధార్ కార్డులో పొరపాట్లను ఫ్రీగా అప్డేట్ చేసుకునేందుకు 14 వరకు గడువు ఇచ్చారు. ఆధార్ అప్డేట్కు గుర్తింపు, చిరునామా రుజువులు సమర్పించాల్సి ఉంటుంది. ఉడాయ్(యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా)మీ సమాచారాన్ని రికార్డుల ప్రకారం సరిచూసి అప్డేట్ చేస్తుంది. ఈ నెల 14 తర్వాత ఆధార్ అప్డేట్కు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
నేటి నుంచి ఎడ్‌సెట్ తుది విడత కౌన్సెలింగ్
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రెండేండ్ల బీఈడీ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే ఎడ్‌సెట్ తుది విడత కౌన్సెలింగ్ గురువారం నుంచి ప్రారంభంకానుంది. 17 వరకు రిజిస్ట్రేషన్‌కు, 20 వరకు వెబ్ ఆప్షన్లకు, 21న వెబ్ ఆప్షన్ల సవరణకు అవకాశం కల్పించగా, 25న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు 30లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్‌బాబు సూచించారు.
దసరా, దీపావళికి 24 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): దసరా, దీపావళి సందర్భంగా సికింద్రాబాద్-తిరుపతి, శ్రీకాకుళం-తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య 24 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ రైళ్లు కాచిగూడ, ఉందానగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, కర్నూల్, డోన్, కడప, రేణిగుంట మీదుగా నడుస్తాయన్నారు. రేణిగుంట, నెల్లూరు, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, కొత్తవలస, చీపురుపల్లి స్టే షన్ల మీదుగా అక్టోబర్ 5 నుంచి నవంబ ర్ 11 వరకు నడుస్తాయని పే ర్కొన్నారు.