మెట్పల్లి, అక్టోబర్ 21 : ఎన్నో ఆశలతో బతుకుదెరువు కోసం బహ్రెయిన్ (బేరాన్)కు వెళ్లిన ఓ యువకుడిని విధి కాటేసింది. ఐదేండ్ల కిందట తనువు చాలించిన ఆ వలసజీవి మృతదేహాన్ని గుర్తించేవారు లేక దిక్కూమొక్కూలేని అనాథ శవంలా మార్చురీ గదిలో మగ్గుతున్నది. చివరకు ఆ దేశంలోని భారత ఎంబసీ అధికారుల దృష్టికి వెళ్లడంతో పాస్‌పోర్టు ఆధారంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన శ్రీపాద నరేశ్‌గా గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్‌పల్లిలోని రాంనగర్లో ఉండే ధర్మపురి భారతి, అశోక్ దంపతులకు ఆనంద్, నరేశ్ ఇద్దరు కొడుకులు. నరేశ్ బహ్రెయిన్ వెళ్లాడు. 2010లో వచ్చి రెండు నెలల తర్వాత తిరిగి బహ్రెయిన్ వెళ్లాడు. నరేశ్ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తెప్పించాలని ప్రజావాణిలో ఆనంద్ విజ్ఞప్తి చేశారు.