రామంతాపూ ర్, సెప్టెంబర్ 26: ఓ యువతిపై ప్రే మోన్మాది దాడి చేసి న ఘటన ఉప్పల్ బస్‌స్టాప్ వద్ద గురువారం చోటుచేసుకుంది. భువనగిరికి చెందిన రాగల సాయికుమార్(24), ఓ యువతి గతంలో ప్రేమించుకోగా.. మనస్పర్థలు రావడంతో విడిపోయారు. చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరూ గురువారం ఉప్పల్ బస్‌స్టాప్ వద్ద కలుసుకోగా.. తనను ప్రేమించాలంటూ సాయికుమార్ యువతిపై ఒత్తిడి చేశాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఆమెపై కత్తితో దాడిచేశాడు. యువతి వేలికి గాయం కాగా, స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పంపుసెట్ల విద్యుద్దీకరణ పథకానికి శ్రీకారం ; 508.95 కోట్ల కేటాయింపు
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ వ్యవసాయ పంపుసెట్ల విద్యుద్దీకరణ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు రూ. 508. 95కోట్లు కేటాయించింది. గురువారం పాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, సరూర్‌నగర్, మెదక్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, నారాయణ్‌పేట్, రాజేంద్రనగర్, గద్వాల, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ సర్కిళ్ల పరిధిలోని వ్యవసాయ పంపుసెట్లను విద్యుద్దీకరిస్తారు. ఈ స్కీం కింద 25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ నుంచి నాలుగు 5హెచ్‌పీ పంపుసెట్లకు కనెక్షన్ ఇస్తారు, ట్రాన్స్ఫార్మర్ నుంచి 4 మోటార్లకు కనెక్షన్ ఇవ్వాలంటే కేవీ కండక్టర్, ఎల్టీ కేబుల్, పోల్స్ ఇతరత్రా ఏర్పాటుకు 3 లక్షలు ఖర్చవుతుంది. ఒక్కో పంపుసెట్‌కు 75 వేల చొప్పున వెచ్చించాలి.