దుబ్బాక, ఆగస్టు 30: ఆర్థిక ఇబ్బందులతో చేనేత కుటుంబానికి చెందిన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలో చేనేత కార్మికుడు తుమ్మ రాజలింగం-సత్యవతి కుటుంబంతో నివసిస్తున్నారు.
చేనేత పని లేకపోవడంతో రాజలింగం బీడీ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడి భార్య సత్యవతి బీడీ కార్మికురాలు. వీరి కుమారుడు తుమ్మ నవీన్ (29) సిద్దిపేటలో ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నాడు. నవీన్‌కు సిద్దిపేటకు చెందిన ఓ యువతితో నాలుగేండ్ల కిందట వివాహం జరిగింది.
చాలీచాలని జీతంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీంతో నవీన్ తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు దుబ్బా క పోలీసులు తెలిపారు.