Crime news | తల్లిదండ్రులు మందలించారని.. యువకుడి ఆత్మహత్య
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడలో ఉరితాడు పెట్టుకొని మరీ వీడియో తీసి బలవన్మరణం పొందాడు.ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కమ్మరిపేట తండాలో చోటు చేసుకుంది.
కోనరావుపేట, 14 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడలో ఉరితాడు పెట్టుకొని మరీ వీడియో తీసి బలవన్మరణం పొందాడు.ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కమ్మరిపేట తండాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన భూక్య రాజు, జ్యోతి దంపతులకు ఒక కుమారుడు దినేష్ (17), కూతురు దీపిక ఉన్నారు.
దంపతులు ఇద్దరు కూలీ పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొంతకాలంగా దినేష్ స్కూల్ మానేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయాన్నే తండాలోని ఓ కిరాణ షాపునకు వెళ్లి దినేష్ సిగిరెట్ డబ్బా దొంగతనం చేశాడని కిరాణ షాపు యజమాని ఇంటికి వచ్చి గొడవకు దిగింది.
ఈక్రమంలో దినేష్‌ను తల్లిదండ్రులు మందలించడంతో పాటు పరువు తీస్తారనే అవమానంతో ఇంట్లో నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయాడు. వట్టిమల్ల గ్రామశివారులోని దుర్గమ్మ ఒర్రె దగ్గర గల గుట్టబోరుకు చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. సాయంత్రమైనా ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు వెతుకగా రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తుపట్టి అక్కడికి వెళ్లి చూసే సరికి చెట్టుకు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి భూక్య రాజు ఫిర్యాదు మేరకు కిరాణ షాపు యజమానురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమాకాంత్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

