Gaddam Vinod | హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏ గడ్డం ప్రసాద్‌తో తనకు ప్రాణహాని ఉందని బెల్లంపల్లికి చెందిన న్యాయవాది, నాలుగు నెలల గర్భిణి గడవీణ మమత తెలంగాణ హైకోర్టు ఎదుట తన మూడేళ్ల పాపతో నిరసన తెలిపింది.
బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీకి చెందిన చిప్పరి విక్టోరియా అనే మహిళ భర్త ఉండగానే ఒంటరి మహిళా పింఛన్ పొందుతున్నారని కలెక్టర్‌కు మమత ఫిర్యాదు చేసింది. దీంతో పగ పెంచుకున్న విక్టోరియా కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని, ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏ గడ్డం ప్రసాద్ బెల్లంపల్లిలో తిరగనివ్వనని, చంపేస్తానని ఫోన్లో బెదిరిస్తున్నట్లు మమత వాపోయింది.
తనను లాయర్ అని కూడా చూడకుండా.. విక్టోరియా కుటుంబ సభ్యులు నిన్న తనను విచక్షణారహితంగా కొట్టారు. కడుపులో తన్నారు. బెల్లంపల్లిలో న్యాయం జరగట్లేదని చెప్పి ఇవాళ హైకోర్టుకు రావడం జరిగిందని మమత పేర్కొన్నారు. తనను బెదిరిస్తున్న గడ్డం ప్రసాద్‌తో పాటు విక్టోరియా కుటుంబంపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏతో తనకు ప్రాణహాని ఉంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏ గడ్డం ప్రసాద్‌తో తనకు ప్రాణ హాని ఉందని బెల్లంపల్లికి చెందిన న్యాయవాది, నాలుగు నెలల గర్భిణి గడవీణ మమత తెలంగాణ హైకోర్టు ఎదుట తన మూడేళ్ల పాపతో నిరసన తెలిపింది.
బెల్లంపల్లి పట్టణంలోని… pic.twitter.com/lDgELWAqqw
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2024