హైదరాబాద్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ): వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో జరిగిన అవకతవకలపై విచారణ పూర్తిచేసి బాధ్యులపై చర్యలు తీసుకుని, దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. సోమవారం సచివాలయంలో జిల్లా సహకార శాఖ అధికారులు, డీసీసీబీ సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సహకారశాఖ ఆడిటర్లు పీఏసీఎస్ సంఘాల ఆడిట్‌ను వారంలోగా పూర్తిచేయాలని సూచించారు. సహకార సంఘాల ఆడిట్‌ను జనవరిలోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. అవకతవకలపై ఏర్పాటు చేసిన సెక్షన్ 51 ఎంక్వయిరీలు, సెక్షన్ 52 పరిశీలనల చట్టం ప్రకారం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుని, నిధులు రాబట్టాలని అధికారులను ఆదేశించారు.