DK Aruna | హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఓ గుర్తు తెలియని దుండగుడు చొరబడ్డాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ముఖానికి ముసుగు, చేతులకు గ్లౌజులు ధరించి ఇంట్లోకి ప్రవేశించిన అగంతకుడు ఇంట్లో కిచెన్, హాల్ సీసీ కెమెరాలు ఆఫ్ చేశాడు. గంటన్నరపాటు ఇంట్లో కలియతిరిగాడు. అయితే కిచెన్ విండో నుంచి అగంతకుడు ఇంట్లోకి దూరినట్లు తెలిసింది.
అయితే, దుండగుడు వచ్చిన సమయంలో డీకే అరుణ ఇంట్లో లేకపోవడం ప్రమాదమే తప్పింది. మరోవైపు, డీకే అరుణ ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగకపోవడంపై కుట్రకోణం దాగి ఉందని డీకే అరుణ కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేశారు. దీంతో డీకే అరుణ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఇంట్లో పోలీసులు, క్లూస్ టీమ్ తనిఖీలు చేపట్టారు. తనపై ఏదైనా కుట్రకు ప్లాన్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్న ఎంపీ డీకే అరుణ.. తన ఇంటికి భద్రత పెంచాలని కోరారు.