హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): అపార్ట్మెంట్లో ఫ్లాట్ల విక్ర యం పేరిట కోట్లు వసూలు చేసి మోసం చేశారని సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణపై వచ్చి న ఫిర్యాదులను స్టేట్మెంట్లుగా రికార్డు చేయాలని పోలీసులను హైకోర్టు ద్వి సభ్య ధర్మాసనం ఆదేశించింది. ఒకే నేరం పై పలుచోట్ల కేసులు నమోదు చేయడా న్ని లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు హైకోర్టులో సవాల్ చేశారు.
తొలుత దీని పై సింగిల్ జడ్జి విచారణ చేపట్టి లక్ష్మీనారాయణపై నమోదైన కేసులను సీసీఎస్కు బదిలీ చేయాలని తీర్పు చెప్పారు. ఒక్క కేసును లీడ్ కేసుగా తీసుకొని దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులు ద్వి సభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ అప్పీల్ పిటిషన్లపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూ యాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం విచారణ జరిపింది. ఒకే నేరంపై అనేక కేసులు నమోదు చేయరాదని, ఒకవేళ చేసినా అన్నింటినీ కలిపి ఒకే కేసుగా విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది.