హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఎనిమిదేండ్లుగా రాష్ట్రంలో సుభిక్ష పాలనను అందిస్తూ, రాష్ర్టాన్ని శిఖరాగ్రాన నిలిపిన సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని తెలంగాణకు చెందిన ఎన్నారై, కెనడా, టొరంటోలో ఐటీ మేనేజర్‌గా పనిచేస్తున్న రామకృష్ణ అక్కిరాజు పేర్కొన్నారు.
అన్ని ప్రాంతాలవారిని కలుపుకొని ముందుకు సాగుతూ.. దేశంలో ఫెడరల్ స్ఫూర్తిని నింపే శక్తి ఒక్క కేసీఆర్‌కే ఉన్నదని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ మా డల్ దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు.