Road accident | రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు యువకుల దుర్మరణం
Road accident | నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రోజులుగా రోడ్డు పక్కన దిగబడి ఉన్న ఓ లారీని బుధవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు.
Road accident : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రోజులుగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ లారీని బుధవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. నిజామాబాద్ రూరల్ మండలం శ్రీనగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. మాక్లూర్ మండలం చిట్లి గ్రామానికి చెందిన వంశీ (19), నిజామాబాద్ కుమార్ దల్లి ప్రాంతానికి చెందిన రాజేష్ (20) అనే ఇద్దరు యువకులు.. తమ స్నేహితుడైన రాజేష్ అనే మరో యువకుడితో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనగర్ వద్ద గల ఓ రైస్ మిల్ దగ్గర ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో వంశీ, రాజేష్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాజేష్ అనే మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Y.S. Jagan | చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాం : వైఎస్ జగన్
Woman lost outside Zoo | భర్తతో కలిసి జూకు వెళ్లి అదృశ్యమైన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే?
‘రైతుల భవిష్యత్ పోరాటాలకు నల్లగొండ మహాసభలో కార్యాచరణ’
Chain Snachers | చైన్ స్నాచింగ్ దొంగలను కిష్టమ్మ ఎలా చితక్కొట్టిందో చూశారా..?
Mallikarjun Kharge | నిరసనను వాయిదావేసే ప్రసక్తే లేదు, ర్యాలీ నిర్వహించి తీరుతాం : మల్లికార్జున్ ఖర్గే
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

