న్యాల్కల్ జూన్ 21: ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్‌పూర్‌కు చెందిన రైతు హెచ్ మల్లప్ప నిమ్జ్ భూసేకరణలో 2.36 ఎకరాల అసైన్డ్ భూమిని కోల్పోయాడు. తాను నివేదిక ఇస్తేనే పరిహా రం చెక్కు వస్తుందని, రూ. లక్ష ఇవ్వాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ దుర్గయ్య రైతు మల్లప్పను డిమాండ్ చేశాడు. ఈ మే రకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. శుక్రవారం మల్లప్ప ఆర్ఐకి ఫోన్‌చేయగా, గంగ్వార్ చౌరస్తాలోగల కిరాణాషాప్ వద్దకు రమ్మన్నాడు. అక్కడ ఆర్ఐ దుర్గయ్య రైతు నుంచి రూ.70 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.