హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): హజ్ యాత్రలో బస్సుల్లో రద్దీ కారణంగా హజ్లో తెలంగాణ యాత్రికుడు ప్రాణాలను కోల్పోయాడు. మినా నుంచి ఆరాఫత్కు రవాణా సౌకర్యం లేక యాత్రికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెండు రోజులుగా మినాలోని టెంట్ల కిందనే నిరీక్షిస్తున్నారు. వెంటనే తెలంగాణ హజ్ యాత్రికులను ఆదుకోవాలని, మినా నుంచి ఆరాఫత్కు తరలించేందుకు చర్య లు చేపట్టాలని రాష్ట్ర హజ్ కమిటీ కేంద్రాన్ని కోరింది. ఈ విషయమై కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖకు రాష్ట్ర హజ్ కమిటీ ఈవో షేక్ లియాఖత్ హుస్సేన్ శనివారం లేఖ రాశారు. మినా నుంచి ఆరాఫత్కు బస్సు సౌకర్యం లేకరెండు రోజులుగా దాదాపు 2000 మందికిపై గా తెలంగాణ యాత్రికులు అక్కడే టెంట్ల కిం దనే నిరీక్షిస్తున్నారని ఈవో వెల్లడించారు. బస్సు లో రద్దీ కారణంగా తెలంగాణ యాత్రికుడు మహమ్మద్ తాజుద్దీన్ మృతి చెందారని తెలిపా రు. తెలంగాణ యాత్రికులకు మినాలో టెంట్ కింద కనీసవసతులు లేవని, రెండు రోజులుగా ఆకలిదప్పులతో అలమటిస్తున్నారని తెలిపారు. సౌదీ అరేబియా ప్రభుత్వంతో సంప్రదించి స మస్యను పరిష్కరించాలని, తెలంగాణ యాత్రికులను క్షేమంగా ఆరాఫత్ చేర్చాలని హజ్ కమి టీ ఈవో ఆ లేఖలో కేంద్రాన్ని కోరారు.