Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం : ఒకే కాన్పులో కవలలు జన్మించడం సహజమే. కానీ ఈ మహిళ మాత్రం ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. ఈ సంఘటన భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో వెలుగు చూసింది.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ మహిళకు నెలలు నిండడంతో.. ప్రసవం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఇప్పటికే ఆమె ఏడు సార్లు ప్రసవించింది. ఎనిమిదో కాన్పులో ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ ముగ్గురి పిల్లలతో కలిపి ఆమె సంతానం పది మందికి చేరింది.