Congress | చౌటుప్పల్, జూన్ 23: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సింగిల్ విం డో మాజీ చైర్మన్ చింతల దామోద ర్‌రెడ్డికి పార్టీ మారాలని డీసీవో ప్రవీణ్‌కుమార్ సూచన చేశారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన ఫోన్ సం భాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చైర్మన్‌గా ఉన్న దామోదర్‌రెడ్డి తొలగింపునకు మా ర్చి 2న ఉత్తర్వులు జారీ కాగా.. తనను ఎందుకు సస్పెండ్ చేశారని ఫోన్లో డీసీవోను ప్రశ్నించగా.. కాంగ్రెస్ లోకి పోవాలని సలహా ఇచ్చారు. ఆ సంభాషణ ఆదివారం సోష ల్ మీడియాలో వైరల్ అయ్యింది. వారి మధ్య జరిగిన సంభాష ణ ఇలా ఉంది.
చింతల: సారూ.. నేను ఏం నేరం చేశాను. నన్ను పదవి నుంచి ఎందుకు తొల గించారు?
డీసీవో: మీరు నేరం చేసినట్టు కాదు. మీరు ఆ పార్టీలోకి పోవాలి.
చింతల: ఎందులోకి? కాంగ్రెస్‌లోకి పోవాలా? అందులోకి పోవాలంటే ఎ వరిని కలువాలి సారూ.. మంత్రి వెంక ట్రెడ్డినా? ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డినా?
డీసీవో: మొదట కోమటిరెడ్డి రాజగోపా ల్రెడ్డిని కలువాలి. అని సూచించారు. గతంలో జరిగిన ఈ సంభాషణ తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.