ఖమ్మం రూరల్, ఆగస్టు 27 : సూర్యాపేట నుంచి ఖమ్మం నగరంవైపు వస్తున్న పెట్రోల్ ట్యాంకర్ శనివారం ఉదయం ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు సమీపంలో అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యహరించడంతో రోడ్డు కింద భాగానికి వెళ్లి వాహనం ఓవైపు ఒరిగిపోయింది.
ట్యాంకర్ బోల్తా పడిందన్న విషయం తెలుసుకొన్న స్థానికులు పెట్రోల్‌ను తీసుకెళ్లేందుకు క్యాన్లు, బకెట్లతో భారీగా తరలొచ్చారు. నాజిల్ ద్వారా లీకవుతున్న పెట్రోల్‌ను నింపుకొనేందుకు ఎగబడ్డారు. డ్రైవర్ ఎంత మొరపెట్టుకొన్నా.. ఫలితం లేకుండాపోయింది.