Sangareddy | సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో సంక్రాంతి పండుగ వేళ విషాదం నెలకొంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఝరాసంగం మండలం పొట్పల్లిలో పతంగులు ఎగురవేశారు. అయితే ఓ గాలిపటం విద్యుత్ తీగల్లో చిక్కుకుంది. ఆ గాలి పటాన్ని తీసేందుకు శివకుమార్ అనే వ్యక్తి యత్నించాడు. దీంతో విద్యుత్ షాక్కు గురయ్యాడు. జహీరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా శివకుమార్ మృతి చెందాడు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.