ములుగు : వేటగాళ్లు(Hunters) అమర్చిన విద్యుత్ తీగల(Electric wires)కు ఓ నిండు ప్రాణం బలైయింది(Person died). ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ములుగు(Mulugu) మండలం పెగడపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి పెగడపల్లి గ్రామానికి చెందిన మీనుగు సాంబయ్య (42) మృతి చెందాడు.
సమాచారం అందుకున్న సీఐ రంజిత్ కుమార్ ఎస్ వెంకటేశ్వర్, విద్యుత్ శాఖ ఏఈ సాయి కృష్ణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. విద్యుత్ తీగలను అమర్చిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాంబయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.