పెద్దపల్లి : పెద్దపల్లి(Peddapalli) జిల్లాలోని పెద్దపల్లి మండలం అప్పన్నపేట(Appannapet) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(PACS ) పాలకమండలి చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం(No-confidence motion) నెగ్గింది. 13 మంది సభ్యులు కలిగిన పాలకమండలిలో చైర్మన్ బీఅర్ఎస్ పార్టీకి చెందిన దాసరి చంద్రారెడ్డి పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 11 మంది సభ్యులు ఓటు వేశారు . కాగా, ఉపాధ్యక్షుడు చింతపండు సంపత్‌ను తాత్కాలిక చైర్మన్‌గా నియమించినట్లు తెలిపిన జిల్లా సహకార అధికారి శ్రీ మాల తెలిపారు.