నాగార్జునసాగర్‌లో ఎన్డీఎస్ఏ సందర్శన
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) టీమ్ మంగళవారం నాగార్జునసాగర్ డ్యామ్‌ను సందర్శించింది.
- మూడు రోజులపాటు డ్యామ్‌ను పరిశీలించనున్న టీమ్
- ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించే భాగంలోనే సమీక్ష
నందికొండ, ఫిబ్రవరి 13: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) టీమ్ మంగళవారం నాగార్జునసాగర్ డ్యామ్‌ను సందర్శించింది. నందికొండ హిల్‌కాలనీలోని అతిథి గృహం విజయవిహార్‌కు చేరుకున్న సీడబ్ల్యూసీ డైరెక్టర్ రమేశ్, ఎన్డీఎస్ఏ సీఈ ప్రమీల, ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ విజయలక్ష్మి, డీఈఈ సతీశ్, కేఆర్ఎంబీ సభ్యులకు ఎన్నెస్పీ సీఈ అజయ్‌కుమార్, ఎస్ఈ నాగేశ్వర్రావు పుష్పగచ్ఛంతో స్వాగతం పలికారు. ఈ ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించే ప్రక్రియలో భాగంగా డ్యామ్‌ను పరిశీలించాల్సిన అంశాలపై బృందం సభ్యులు తెలంగాణ, ఆంధ్ర ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనంతరం నాగార్జునసాగర్ డ్యామ్, గ్యాలరీ, క్రస్ట్ గేట్లు, వాక్‌వే బ్రిడ్జి, స్పిల్‌వేలను పరిశీలించారు. గత నెల కేంద్ర జలశక్తి నేతృత్వంలో తెలంగాణ, ఆంధ్ర ఇరిగేషన్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగానే సీడబ్ల్యూసీ డైరెక్టర్ రమేశ్ ఆధ్వర్యంలో ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ బృందం సభ్యులు నాగార్జునసాగర్ డ్యామ్‌ను సందర్శించారు. డ్యామ్ భద్రత, నీటి నిల్వల వినియోగం అంశాలను ఆరా తీశారు. బుధవారం ఎడమ, కుడి కాల్వలు, జలవిద్యుత్తు కేంద్రాలను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. వారి వెంట తెలంగాణ ఈఈ మల్లికార్జున, డీఈఈలు శ్రీనివాస్‌రావు, పాపారావు, ఏఈలు కృష్ణయ్య, సత్యనారాయణ, ఆంధ్ర ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

