హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాల ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకులు (BRS leaders), కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాల (Congress goons) దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీయే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అకారణం గా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావువేధింపులు తాళలేక మున్సిపల్ కౌన్సిలర్(Municipal councilor) ఆత్మహత్యాయత్నం(Attempted suicide) చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే((MLA Prem Sagar Rao) తనను వేధిస్తూ, పోలీసుల చేత తనపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని మాజీ ఎంపీపీ, నస్పూర్ మున్సిపల్ 21వ కౌన్సిలర్ బేర సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆగడాలు భరించలేక మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయం వద్ద సర్జికల్ బ్లేడ్‌తో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సత్యనారాయణకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వేదింపులకు ఆత్మహత్యాయత్నం చేసుకున్న మున్సిపల్ కౌన్సిలర్
మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనను వేధిస్తూ, పోలీసుల చేత తనపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని ఆత్మహత్యాయత్నం చేసుకున్న మాజీ ఎంపీపీ, నస్పూర్ మున్సిపల్ 21వ కౌన్సిలర్ బేర… pic.twitter.com/Nne7GOe2nN
— Telugu Scribe (@TeluguScribe) August 18, 2024