Smart Gov App | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రజలకు వీలుగా ఉండేలా ‘స్మార్ట్ గవ్’ యాప్ను అభివృద్ధి చేశాడో సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఐఐఐటీ హైదరాబాద్లో ఎంటెక్ చేసిన రజనీశ్ బాజ్పాయ్.. కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డారు.
మాతృదేశానికి ఏదైనా చేయాలన్న తపనతో.. గ్రామీణ భారతదేశానికి స్మార్ట్ గవర్నెన్స్, ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ కోసం ఆండ్రాయిడ్ యాప్ రూపొందించారు. 2017లో 2 నెలల సెలవుపై ఇండియాకు వచ్చి తాను పుట్టి పెరిగిన ప్రాంతాల్లో అధ్యయనం చేసి, ఆధునిక ప్రపంచంలో గ్రామాలకు ఏం కావాలో తెలుసుకొని ఈ యాప్ను రూపొందించారని, ప్రస్తుతం ఈ యాప్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని ఐఐఐటీ ప్రతినిధి ఒకరు తెలిపారు.