Viral Video | ఓ వ్యక్తి 5 గంటల పాటు నీటి ముగిని ఉన్నాడు. అతను చనిపోయి ఉండొచ్చని స్థానికులు భావించి, పోలీసులకు సమాచారం అందించారు. బయటకు తీసేందుకు యత్నించిన పోలీసులు షాక్కు గురయ్యారు. ఎందుకంటే పోలీసులు రాగానే ఆ వ్యక్తి నీటిలో నుంచి బయటకు వచ్చాడు.
వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా పరిధిలోని రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు. గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని.. బయటకు లాగారు. కానీ అతను ప్రాణాలతో ఉన్నాడు. పోలీసులను చూసి నిదానంగా నీటిలో నుంచి బయటకు వచ్చాడు.
ఆ వ్యక్తిని నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 10 రోజుల నుండి గ్రానైట్ క్వారీలో రోజుకు 12 గంటల పాటు ఎండకు పని చేస్తున్నట్లు తెలిపాడు. ఆ వేడికి తట్టుకోలేక నీటిలో సేదతీరడానికి వచ్చినట్లు అతను పోలీసులకు తెలిపాడు.
తాగి నీటిలో పడుకున్న వ్యక్తి.. చనిపోయాడనుకొని పోలీసులకు ఫోన్ చేసిన స్థానికులు.. తీరా వచ్చి చూస్తే షాక్
హనుమకొండ – రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు.. అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు మరియు 108 సిబ్బందికి సమాచారం… pic.twitter.com/zzR7SGbFwP
— Telugu Scribe (@TeluguScribe) June 10, 2024