కుక్క కరుస్తోందని స్టేషన్లో ఫిర్యాదు.. పోలీసులు షాక్!!
పోలీసులను ఓ వింత ఫిర్యాదు షాక్‌కు గురి చేసింది. తనను ఓ కుక్క రోజూ కరుస్తోందని, దాని యజమానిపై కేసు నమోదు చేయాలంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ వింత ఘటన మహబూబాబాద్‌లో జరిగింది.
పోలీసులను ఓ వింత ఫిర్యాదు షాక్‌కు గురి చేసింది. తనను ఓ కుక్క రోజూ కరుస్తోందని, దాని యజమానిపై కేసు నమోదు చేయాలంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ వింత ఘటన మహబూబాబాద్‌లో జరిగింది.
వివరాల్లోకెళితే, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ధరావత్ పూల్యనాయక్ సోమవారం పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. గూడూరు మండలకేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయ సమీపంలో ఓ కుక్క ప్రతిరోజూ తన వెంటపడుతున్నదని, కరుస్తున్నదంటూ ఫిర్యాదు చేశాడు. దాన్ని కట్టేయకుండా బహిరంగ ప్రదేశాల్లో వదిలిపెడుతున్న యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ వింత ఫిర్యాదును చూసి పోలీసులు అవాక్కయ్యారు. చేసేదేమిలేక కుక్క యజమానిని పిలిచి, మందలించి పంపారు. ధరావత్ పూల్యనాయక్కు చికిత్స చేయించాలని ఆ యజమానిని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

