హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పీఆర్టీయూ టీఎస్‌లో అదే సంఘానికి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షప్రధాన కార్యదర్శులు రాసిన లేఖ సంచలనంగా మారింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డికి జనవరి 29న రాసిన లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. పీఆర్టీయూ టీఎస్ అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల నుంచి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
ఎన్నికల్లో పోటీచేస్తుండడంతో శ్రీపాల్‌రెడ్డి 2024 డిసెంబర్ 31న స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. సంఘం నియామళి ప్రకారం టీచర్ ఉద్యోగంలో ఉన్నవారే పదవిలో ఉన్నట్టు లెక్క. దీంతో రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాళీ అయినట్టే. కానీ ఇంత వరకు కొత్త అధ్యక్షుడిని నియమించలేదు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షప్రధాన కార్యదర్శులు లేఖ సంధించారు.