అచ్చంపేట, మే 11 : నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అడవిలోని అమ్రాబాద్ టైగర్రిజర్వు ఫారెస్టులో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఆదివారం ఉదయం సఫారీకి వెళ్లిన యాత్రికులకు ఫరహాబాద్ వ్యూపాయింట్ ప్రాంతంలో ఓ పెద్దపులి కనిపించింది.
కొద్దిసేపు రోడ్డుకు అడ్డంగా నిలబడి అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. యాత్రికులు పెద్దపులి కదిలికలు సెల్ఫోల్లో బంధించారు.