ఆదిలాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జోగు రామన్న(MLA Jogu Ramanna) ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ ఎక్స్‌రోడ్ నుంచి భోరజ్ మండలం కేంద్రం వరకు నాలుగు కిలోమీటర్ల మేర ఎన్‌హెచ్-44 మీదుగా వందలాది మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు
అనంతరం భోరజ్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని సూచించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ వంద సీట్లలో విజయం సాధిస్తోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి హ్యాట్రిక్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా పార్టీ పటిష్టతకు పాటుపడాలని పిలుపునిచ్చారు.