సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో(Suryapet )భారీ అగ్ని ప్రమాదం(Huge fire) చోటు చేసుకుంది. దురాజ్పల్లిలోని జయశంకర్ పాలిమర్స్ పేపర్, ప్లాస్టిక్ గ్లాసుల తయారీ గోదాంలో(Plastic warehouse) షార్ట్ సర్య్కూట్తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది ఫైర్ స్టేషన్కు ఫోన్ చేశారు. వెంటనే సంఘటన స్థలనానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో మిషనరీతో పాటు ముడిసరుకు పూర్తిగా దగ్ధమైంది. సుమారు కోటి రూపాయల వరకు ఆస్థి నష్టం జరిగినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.