Girl student : ప్రభుత్వ పర్యవేక్షణా లోపంతో గురుకుల పాఠశాలలో మరో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. తమ కుమార్తె మరణవార్త వినగానే తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు బోరున విలపించారు. సిద్దిపేట మండలం మిట్టపల్లి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని హర్షిత అనుమానస్పద రీతిలో మరణించింది.
అయితే స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్ ఈ విషయాన్ని గొప్యంగా ఉంచారు. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో విద్యార్థిని మృతిచెందినట్లు సమాచారం. బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. బాలిక స్వగ్రామం బెజ్జంకి మండలంలోని కళ్ళేపల్లి అని అధికారులు తెలిపారు.
గురుకుల పాఠశాలలో మరో విద్యార్థిని అనుమానాస్పద మృతి
బోరున కన్నీళ్లు పెట్టుకున్న తల్లితండ్రులు
సిద్దిపేట మండలం మిట్టపల్లి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని హర్షిత అనుమానస్పద మృతి
విషయాన్ని గొప్యంగా ఉంచిన స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్… pic.twitter.com/bx2Sd3khXq
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2026