హైదరాబాద్ : మావోయిస్టుల పేరుతో దోపిడీలు, బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సులభంగా డబ్బులు సంపాదించాలని మావోల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల మాజీ మావోల ముఠాను యాదాద్రి ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వారిని మీడియా సమావేశం నిర్వహించి, నిందితులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ముందస్తు సమాచారం నలుగురుని అరెస్టు చేశామని, నలుగురు గతంలో జనశక్తిలో పని చేశారని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు పిట్టల శ్రీనివాస్‌కు తుపాకీ తయారీ తెలుసునని.. నిందితులు నాగమల్లయ్య, శ్రీనివాసరెడ్డి, స్వామి యాదాద్రిలో దోపిడీలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. నాగమల్లయ్య గతంలో ఓ హత్య కేసు నిందితుడని.. శ్రీనివాసరెడ్డితో కలిసి 1986 నాగమల్లయ్య పని చేశాడన్నారు.
పిట్టల శ్రీనివాస్, అతని భార్య పుష్ప మాజీ మావోయిస్టులన్నారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి మూడు తుపాకులు, నాటు తుపాకీ, ఏడు డిటోనేటర్లు స్వాధీనం, బుల్లెట్లో వాడే 40 గ్రాముల పౌడర్, 15 గ్యాస్ సిలిండర్లు, మూడు మొలైల్ ఫోన్లు, మావోల లెటర్‌హెడ్స్, డిల్లింగ్ మిషన్, కంట్రీమేడ్ తపంచ, ఒక ద్విచక్ర వాహనంతో పాటు పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ మహేశ్ భగవత్ వివరించారు.