నల్లగొండ : నల్లగొండ(Nallagonda) పాత జెడ్పీ ఆఫీస్ ఆడిటింగ్ సెక్షన్లో(Auditing section) శుక్రవారం అగ్ని ప్రమాదం(Fire accident )చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముఖ్యమైన పలు ఫైళ్లు దగ్ధమైనట్లు సమాచారం. ప్రమాద ఘటనపై పలు అను మానాలు రేకెత్తుతున్నాయి. షార్ట్ సర్క్యూట్తో జరిగిన అగ్ని ప్రమాదమా..? లేదా ఎవరైనా కుట్ర చేసారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సచామారం అందుకున్న ఉన్నతాధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.