‘కారు’పై అభిమానంతో.. ఎమ్మెల్యేకు గిఫ్ట్ ఇచ్చిన తాత
TRS Party | ఆ వృద్ధుడికి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అంటే మహా ప్రాణం. కారు గుర్తు కనిపించిందంటే చాలు.. ఆనంద పడిపోతాడు. అంతగ ప్రేమించాడు పార్టీ అధ్యక్షుడిని, కారు గుర్తుని. టీఆర్ఎస్ పార్టీపై అభిమానంతో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి
మహబూబ్‌నగర్ : ఆ వృద్ధుడికి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అంటే మహా ప్రాణం. కారు గుర్తు కనిపించిందంటే చాలు.. ఆనంద పడిపోతాడు. అంతగ ప్రేమించాడు పార్టీ అధ్యక్షుడిని, కారు గుర్తుని. టీఆర్ఎస్ పార్టీపై అభిమానంతో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి ఆ తాత ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. కారు బొమ్మను బహుమతిగా ఇచ్చి టీఆర్ఎస్ పార్టీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు వృద్ధుడు.
భూత్పూర్ మండలం ఎల్కిచెర్ల గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.. ఇవాళ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ముంగచేడ్ గోపాల్ అనే రైతు.. స్టీల్‌తో తయారు చేసిన కారు బొమ్మను ఎమ్మెల్యే బహుకరించాడు. కేసీఆర్ ఇచ్చే ఫించన్ డబ్బులు, రైతు బంధు నగదు తన అకౌంట్లో నేరుగా పడుతున్నాయని తాత తెలిపాడు. వృద్ధులు, రైతులను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడని గోపాల్ పేర్కొన్నాడు. కేసీఆర్‌పై ఉన్న అభిమానంతోనే ఎమ్మెల్యేకు కారు బొమ్మను గిఫ్ట్ గా ఇచ్చానని రైతు గోపాల్ స్పష్టం చేశాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

