ఎల్లారెడ్డి రూరల్, ఫిబ్రవరి 19: రైతుబంధు రాలేదు.. రుణమాఫీ కాలేదు.. చదువున్న కొడుకుకు కొలువు దక్కుతుందన్న ఆశ లు అడియాసలవుతున్నాయి. దీంతో మనస్తాపం చెందిన ఓ రైతు బలవన్మరణానికి పా ల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్లో బుధవారం చోటు చేసుకుంది. గుర్జాల్కు చెందిన సుప్పరి మాణిక్యం(49)కు భార్యతోపాటు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
కుమార్తె పెండ్లి కాగా, కుమారుడు చదువుతున్నాడు. మరో కుమారుడు ఉద్యోగం కోసం హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. కోచింగ్ కోసం ఇటీవలే లక్ష ఫీజు చెల్లించాడు. దీంతో రూ.12 లక్షల మేర అప్పు పేరుకుపోయింది. రుణమాఫీ అయ్యే పరిస్థితి కనిపించక పోవడంతో మాణిక్యం పొలం వద్దకు వెళ్లి పురుగులమందు తాగా డు. కుటుంబ సభ్యులు గాంధీ దవాఖానకు తరలించగా.. అప్పటికే మాణిక్యం మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.