నిజామాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(MLC Kavitha) పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆమెకు రాష్ట్రం నుంచే కాకుండా జాతీయంగా, విదేశాల్లో ఉన్న అభిమానులు సామాజిక మాద్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన చిన్నూగౌడ్ అనే అభిమాని ఈసారి కూడా తనదైన శైలీలో కవితకు శుభాకాంక్షలు తెలిపాడు. రాజస్థాన్ (Rajasthan) లోని జైసల్మేర్ (Jaisalmer) లో ఎడారిలో ఒంటెల(Camels) పై ఎమ్మెల్సీ కవిత జెండాలతో వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. నిజామాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, బిగాల గణేష్‌గుప్తా, జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ కవితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.