Suicide Attempt | నాగర్కర్నూల్ : అమ్మానాన్న నన్ను క్షమించండి అంటూ ఓ డిగ్రీ విద్యార్థిని సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాంలో చోటు చేసుకుంది.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలోని మొలచింతలపల్లి గ్రామానికి చెందిన స్ఫూర్తి(21) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సెకండియర్ చదువుతుంది. అయితే ఇవాళ మధ్యాహ్నం స్ఫూర్తి తన హాస్టల్ గదిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె పురుగుల మందు తాగడాన్ని తోటి స్నేహితులు గమనించి, హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన సిబ్బంది బాధితురాలిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం స్ఫూర్తి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
ఇక బాధితురాలు ఓ మూడు పేజీల సూసైడ్ లేఖను రాసి పెట్టింది. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అమ్మ నాన్న నన్ను క్షమించండి అంటూ సూసైడ్ లేఖ రాసి హాస్టల్లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ గర్ల్స్ హాస్టల్లో.. అమ్మ నాన్న నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అంటూ సూసైడ్ నోట్ రాసి పురుగుల మంది తాగి విద్యార్థిని… pic.twitter.com/TvkE5fJTkA
— Telugu Scribe (@TeluguScribe) October 28, 2025