ఏటూరునాగారం:ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద శనివారం గోదావరిలో చేపలు పడుతున్న ఓ మత్స్య కార్మికుడి వలకు మొసలి చిక్కింది. వల బరువుగా రావడంతో పెద్ద చేప పడినట్టు ఆశపడ్డ మత్స్యకారుడు.. తీరా వలను బయటికి తీసి చూసే సరికి మొసలి ఉండటంతో వణికిపోయాడు. అక్కడే ఉన్న కొందరు వల నుంచి మొసలిని వేరు చేసి తిరిగి గోదావరిలోకి పంపించారు.