హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 22(నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఓ టీవీ చానెల్ ప్రతినిధి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపినట్టు సమాచారం. ఈ సోదాల్లో కొన్ని కీలక పత్రాలు, సెల్ఫోన్లతోపాటు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. శుక్రవారంతో ప్రణీత్‌రావు పోలీస్ కస్టడీ ముగియనుండటంతో అతను ఇచ్చిన సమాచారం మేరకు ఈ సోదాలు జరుపగా, ఈ సమయంలో ఆయన పరారీలో ఉన్నట్టు సమాచారం.