మంథని, ఏప్రిల్ 13: పెద్దపల్లి జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధూకర్‌కు మంథని పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బాధిత రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని, ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజుల క్రితం మంథని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అనుమతి లేకుండా దీక్ష చేసినందుకు పుట్ట మధూకర్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు. మంథనిలోని రాజగృహలో పుట్ట మధూకర్‌కు పోలీసులు నోటీసులు అందించారు.