Viral news : ఓ వ్యక్తి డ్రైవింగ్ నేర్చుకుంటుండగా కారు చెరువులోకి దూసుకెళ్లింది. డ్రైవింగ్ నేర్చుకుంటున్న వ్యక్తి, నేర్పుతున్న వ్యక్తి ఇద్దరూ కారులోనే చిక్కుకుపోయారు. స్థానికులు గమనించి వారికి సాయం చేయడంతో ఇద్దరూ సురక్షితంగా ఈదుకుంటూ బయటికి వచ్చారు. తెలంగాణలోని జనగామ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జనగామలోని బతుకమ్మ కుంట పక్కన ఉన్న గ్రౌండ్లో ఓ వ్యక్తి మరో వ్యక్తికి కారు డ్రైవింగ్ నేర్పుతున్నాడు. ఈ క్రమంలో అయోమయానికి గురైన ట్రెయినీ డ్రైవర్ కారు బ్రేక్‌కు బదులుగా యాక్సిలేటర్ తొక్కాడు. దాంతో కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు డోర్ లాక్ తీసి ఈదుకుంటూ రండి అని సూచించగా లాక్ రాలేదు. దాంతో విండోలోంచి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. కారు ఇంకాస్త లోపలికి వెళ్లి ఉంటే ఇద్దరి ప్రాణాలు పోయేవి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
డైవింగ్ నేర్చుకుంటుండగా చెరువులోకి దూసుకెళ్లిన కారు
జనగామ – స్థానిక బతుకమ్మ కుంట పక్కన ఉన్న గ్రౌండ్లో ఓ వ్యక్తికి మరొకతను కారు డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు.
అయితే ఆ సమయంలో అయోమయానికి గురైన డ్రైవర్ బ్రేకు బదులు యాక్సిలరేటర్ తొక్కాడు.. దీంతో కారు నేరుగా చెరువులోకి దూసుకెళ్లింది.… pic.twitter.com/wDnqqqjS66
— Telugu Scribe (@TeluguScribe) October 19, 2024