ఏరోస్పేస్ రంగానికి ఉజ్వల భవిష్యత్

మండలిలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్
రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈ రంగానికి హైదరాబాద్ హబ్‌గా మారుతున్నదని పేర్కొన్నారు. సోమవారం మండలిలో ప్రశ్నో త్తరాల్లో మాట్లాడుతూ.. ఏరోస్పేస్ తయారీ, ఇంజినీరింగ్, మెటీరియల్ విభాగాల్లో 5వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.
రైతు ఆత్మహత్యలులేని రాష్ట్రం: మంత్రి వేముల
రైతుల ఆత్మహత్యలులేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలనేది సీఎం కేసీఆర్ ఆశయమని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు ఏ కారణం చేతనైన రైతు మరణిస్తే రూ.5 లక్షల బీమా అందిస్తున్నామని, కొన్ని సాంకేతిక కారణల వల్ల రైతుబంధు ఎవరికైనా రాకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పక పరిష్కరిస్తామని చెప్పారు.
కొత్త కాలేజీల ప్రతిపాదన లేదు: మంత్రి సబిత
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కొత్తూరు, కొందర్గు మండలాల్లో నూతన జూనియర్ కళాశాలల ఏర్పాటు ప్రతిపాదనలపై ఎమ్మెల్యే అంజయ్య అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
కేసీఆర్ నాయకత్వానికే పట్టం: పల్లా
దేశంలో సిట్టింగ్ ఎమ్మెల్సీలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన పట్టభద్రులు.. రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి బలపర్చారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. 2021-22బడ్జెట్ కేటాయింపులు తెలంగాణ సంపద సృష్టి, మానవ వనరుల కల్పనకు నిదర్శనంగా ఉన్నాయని తెలిపారు.
ఆసరాతో వృద్ధులకు గౌరవం: మంత్రి ఎర్రబెల్లి
ఆసరా పింఛన్లతో వృద్ధులకు, వికలాంగులకు గౌరవం పెరిగిందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 39,36,521మంది ప్రయోజనం పొందుతున్నారని.. ఏటా రూ.11,724 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. కొత్త పింఛన్లు పరిశీలనలో ఉన్నదని చెప్పారు.
రైతులకు ఇబ్బంది రానివ్వం: మంత్రి జగదీశ్‌రెడ్డి
వ్యవసాయమోటర్లకు మీటర్లు పెట్టడంపై కేంద్రం చట్టం తెచ్చేందుకు యత్నిస్తున్నదని, కొత్త చట్టంతో ఇబ్బందులపై సీఎం కేసీఆర్ ఇప్పటికే కేంద్రానికి లేఖ పంపారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది రాకుం డా చూసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
179.85 కోట్ల మొక్కలు నాటాం: మంత్రి అల్లోల
హరితహారంలో 179.85 కోట్ల మొక్కలు నాటినట్టు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. వీటిల్లో మొక్కల్లో 85 శాతం మొక్కలు తప్పక సంరక్షించేలా చట్టాలను సవరించినట్టు వివరించారు. 12,750 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటుచేసి, ప్రతి మొక్కను జియోట్యాగింగ్ చేస్తున్నట్టు తెలిపారు.
ప్రసవ మరణాల తగ్గింపులో ఫస్ట్: మంత్రి ఈటల
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవ మరణాల రేటు తగ్గింపులో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేసీఆర్ కిట్స్ పథ కం కింద ఇప్పటివరకు 11,91,275 మంది లబ్ధిపొందారని, వివిధ దశల్లో రూ.990.26 కోట్లు అందించినట్టు తెలిపారు. కేసీఆర్ కిట్స్ అమల్లోకి వచ్చాక ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 30 నుంచి 50 శాతానికి పెరిగాయని, నవజాత శిశువుల మరణాల రేటు 22 శాతం నుంచి 16.8 శాతానికి తగ్గిందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Aerospace hub
- KTR
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

