పెబ్బేరు, మార్చి 24 : సెల్ఫోన్ చూడొద్దన్నందుకు బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పెంచికలపాడులో ఆదివారం చోటుచేసుకున్నది. గ్రామస్థుల కథనం మేరకు.. గ్రామపంచాయతీ కార్మికుడైన గుర్రం రాముడు కుమారుడు గణేశ్ (12) సూగూరు గ్రామంలో ఏడోతరగతి చదువుతున్నాడు. టీవీ, సెల్ఫోన్ ఎక్కువగా చూడొద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.