కరీంనగర్ విద్యానగర్, అక్టోబర్ 11: వైద్య రంగంలో వస్తున్న నూతన ఒరవడులకు అనుగుణంగా సాంకేతిక, మానవీయ స్పృహతో వైద్యులు సేవలందించాలని ఫిజీషియన్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్సింహులు సూచించారు. కరీంనగర్‌లోని వీ కన్వెన్షన్‌లో రెండు రోజులపాటు జరుగనున్న 9వ రాష్ట్ర స్థాయి ఫిజిషియన్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ ప్రారంభసభలో మా ట్లాడారు. ఎండీలందరూ పీజిషియన్ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సీనియర్ వైద్యులు నందిని చటార్జి, రవికీర్తి, ఎంవీ రావు, శ్రీనివాస్‌కుమార్, గోపాలకృష్ణ గోఖలే, నర్సింహన్, వసంతకుమార్, నాగార్జున మాటూరి వైద్యరంగంలో వస్తున్న మార్పులను వివరించారు. డెంగ్యూలో హెచ్ఎల్హెచ్ ప్రమాదకరమని యశోద డాక్టర్ ఎంవీరావు తెలిపారు. పీజీ విద్యార్థుల కోసం వర్క్‌షాపు, క్విజ్ పోగ్రాం, పేపర్ ప్రజెంటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ చైర్మన్ తిరుపతిరావు, సెక్రటరీ విజయమోహన్‌రెడ్డి, ట్రెజరర్ చైతన్య, రఘురామన్, సురేశ్, వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ప్రశాంతి, నవీన, 1200 మంది డెలిగేట్స్ పాల్గొన్నారు.