హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): టీఎస్డబ్ల్యూఈఆర్ఐ (తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ) సీవోఈ సెట్-2024 మొదటి దశ ప్రవేశ పరీక్షకు 96 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆదివారం రాష్ట్రంలోని 196 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు 76,963 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 74,204 మంది హాజరయ్యారని టీఎస్డబ్ల్యూఈఆర్ఐ సొసైటీ కార్యదర్శి నికోలస్ తెలిపారు.
ఈ పరీక్షకు హాజరైన వారి నుంచి మెరిట్ ప్రాతిపదికన 1:5 నిష్పత్తిలో విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఈనెల 25న రెండో దశ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. రెండో దశకు ఎంపికైన విద్యార్థుల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రెండో దశ పరీక్ష ఫలితాల ఆధారంగా ఇంటర్లో ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.