జోగులాంబ గద్వాల : తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన నవ వరుడు తేజేశ్వర్ హత్య కేసును ( Groom Murder case) జోగుళాంబ( Jogulamba) గద్వాల జిల్లా పోలీసులు చేధించారు. తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని కట్టుకున్న భార్య ఐశ్వర్య, ప్రియుడు తిరుమల్ రావుతో కలిసి తేజేశ్వర్‌ను సుఫారీ గ్యాంగ్ తో మర్డర్ చేయించినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడయ్యింది. దీంతో 8మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ టీ శ్రీనివాస్ రావు గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి కారు, రెండు ఎరుకలి కొడవళ్లు, కత్తి, రూ. 1.20 లక్షల నగదు, పది మొబైల్ పోన్లు , జీపీఎస్ ట్రాకర్‌ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.