హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఎగువ రాష్ర్టాలతోపాటు, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో పలు ప్రాజెక్టులకు స్వల్పంగా వరద వచ్చి చేరుతున్నది. జూరాల ప్రాజెక్టుకు 8,849 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుండగా, దిగువకు 1,400 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు సైతం 7,471 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులకు ఇంకా వరద రావడం లేదు. ప్రాణిహితలో సైతం వరద జాడ లేకుండాపోయింది.