యాచారం, జూన్ 12: రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్స్టేషన్ పరిధిలో 85 ఏళ్ల వృద్ధురాలిపై ఓ దుండగుడు లైంగికదాడిచేసిన ఘటన కలకలం రేపింది. సీఐ నందీశ్వర్రెడ్డి కథనం ప్రకారం.. మంతన్గౌరెల్లిలో 85 ఏళ్ల వృద్ధురాలు తన ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తుండగా బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి మద్యం మత్తులో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
వృద్ధురాలు తీవ్రంగా ప్రతిఘటించించగా దుండగుడు పరారయ్యాడు. గురువారం ఉదయం ఇరుగు పొరుగువారు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్సై మధు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. పోలీసులు, స్థానికులు వృద్ధురాలిని వనస్థలిపురం ఏరియా దవాఖానకు తరలించారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు గ్రామాన్ని సందర్శించి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడికి 25 సంవత్సరాలు ఉంటాయని అతడిని చూస్తే గుర్తుపడుతానని బాధితురాలు చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు.