Raj Tarun | టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ మరోసారి చిక్కుల్లోపడ్డాడు. రాజ్‌పై గతంలో సంచలన ఆరోపణలు చేసిన లావణ్య అనే యువతి మరోసారి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ తనపై దాడికి చేయించాడని.. దోపిడీకి పాల్పడ్డాడంటూ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్‌తో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదైంది. కోకాపేటలోని ఓ విల్లాలో నివాసం ఉంటుండగా.. రాజ్ తరుణ్ కొందరు వ్యక్తులను పంపి తనపై దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. మూడు వేర్వేరు సందర్భాల్లో ఆమెపై బెల్ట్‌లు, గాజు సీసాలతో దాడి చేశారని.. ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను లాక్కెళ్లారని ఆరోపించింది.
ఆమె పెంపుడు కుక్కలను కూడా హతమార్చినట్లు ఆమె వాపోయారు. అయితే, ఈ వివాదానికి కోకాపేట విల్లాకు సంబంధించిన గొడవలే కారణంగా సమాచారం. 2016లో రాజ్ తరుణ్ కలిసి విల్లాను కొనుగోలు చేశానని.. వ్యక్తిగత విభేదాల కారణంగా ఈ ఏడాది మార్చిలో రాజ్ తరుణ్ ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయాడని లావణ్య పేర్కొంది. ఈ విల్లా యాజమాన్య హక్కులకు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగానే తనపై దాడి జరిగిందని తెలిపింది. లావణ్య ఫిర్యాదు ఆధారంగా నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్‌తో పాటు మణికంఠ తంబాడీ, రాజ్ శేఖర్, సుశి, అంకిత్ గౌడ్, రవితేజలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.