హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): పటాకుల తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగి 8మంది మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలైన సంఘటన ఏపీలోని అనకాపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు.
బాధితుల్లో ఎక్కువమంది తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోటకు చెందిన వారు ఉన్నట్టు గుర్తించారు. ఈ ఘటనపై ఏపీ మంత్రి నారాలోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.