ఆసిఫాబాద్: జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలతో సిర్పూర్ పేపర్ మిల్లు (SPM) పంప్‌హౌస్ చుట్టూ వరద నీరు చేసింది. దీంతో ఎనిమిది మంది కార్మికులు పంప్‌హౌస్‌లో చిక్కుకుపోయారు. పెద్దఎత్తున నీరు నిలిచిని నేపథ్యంలో విధుల నుంచి కార్మికులు ఇంటికి చేరుకోకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
అయితే కార్మికులంతా సురక్షితంగానే ఉన్నారని సిర్పూర్ పేపర్ మిల్ యాజమాన్యం ప్రకటించింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. పంప్‌హౌస్ చుట్టూ నీరు నిలిచిపోవడంతోనే వారు బయటకు రాలేకపోయారని వెల్లడించారు. వారితో తాము నిరంతరం టచ్‌లో ఉన్నామని చెప్పారు.