కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ప్రమాదం జరిగింది. గుండాల మండలంలోని శెట్టిపల్లి వద్ద బొలేరో వాహనం (Bolero vehicle) అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఎనిమిది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘనటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
శుక్రవారం ఉదయం చండ్రుగొండ మండలం తిప్పనపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న అశోక్ లెలాండ్ మినీ వ్యాన్ను ఓ బొగ్గు లారీ ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు మృతిచెందారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కొత్తగూడెం దవాఖానకు తరలించారు. కాగా, ఘటనా స్థలంలోనే ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు దవాఖానలో మృతిచెందారు.